25 ఏళ్ల తర్వాత నంద్యాలలో శారదా విద్యానికేతన్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
NANDYAL Oct 11 :- నంద్యాల పట్టణంలోని తేజస్విని హోటల్ లో ఆదివారం శ్రీ శారదా విద్యానికేతన్ పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించబడింది. 2001-2002 సంవత్సరంలో 10వ తరగతి తెలుగు మీడియం పూర్తి చేసుకున్న విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకొని తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కీ.శే. శ్రీ ఎ.పాండురంగారావు గారు స్థాపించిన ఈ పాఠశాలలో వేలాదిమంది విద్యార్థులు విద్యనభ్యసించి జీవితంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు.

ఈ కార్యక్రమానికి పాండురంగారావు గారి సతీమణి శ్రీమతి నాగమణి, కుటుంబ సభ్యులు నాగరాజరావు, విజయలక్ష్మి, ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శేషఫణి హాజరయ్యారు. ఆనాటి ఉపాధ్యాయులు అన్నెం శ్రీనివాసరెడ్డి, హబీబుల్లా, రమేష్, చంద్రశేఖర శర్మ, రామ్మోహన్, శంకర్, జనార్దన్ రెడ్డి, చంద్రుడు, రాజశేఖర నాయుడు, మహిళా ఉపాధ్యాయులు ధనలక్ష్మి, శ్యామల తదితరులను పూర్వ విద్యార్థులు ఘనంగా ఆహ్వానించి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

ఈ సందర్భంగా గురువులు తమ బోధనలను గుర్తు చేయగా విద్యార్థులు తమ అనుభూతులను పంచుకున్నారు. ఆనాటి విద్యార్థులు సునీల్, షేక్షావలి, సుదర్శన్, వంశీకృష్ణ, ప్రణీత్, మహమ్మద్ తదితరులు మాట్లాడుతూ తాము జీవితంలో ఉన్నతంగా స్థిరపడటానికి గురువులే కారణమని, వారిని మళ్ళీ ఇలా కలుసుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి సార్ మాట్లాడుతూ గురు శిష్యుల అనుబంధాన్ని గుర్తు చేస్తూ, విద్యార్థులందరూ ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడి సమాజంలో ముఖ్యమైన స్థానాల్లో నిలవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
Arattai