నంద్యాలలో ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
NANDYAL Oct 11 :- నంద్యాల పట్టణం,కోట వీధిలోని శ్రీ కాళికాంబ చంద్రశేఖర దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.ఉదయం అమ్మ వారికి పంచామృతాభిషేకం,ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు శ్రీ కాళీమాత సేవా సమాజం సభ్యులు తెలిపారు.అమ్మవారు శైల పుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ,ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు
Arattai