నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రాం
NANDYAL Oct10 :- నంద్యాల పట్టణంలోని PSC&KVSC ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థిని విద్యార్థులకు ఇండక్షన్ ప్రోగ్రాం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు.ఈ కార్యక్రమంలో నూతన విద్యార్థిని విద్యార్థులకు కళాశాల యందలి అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, తరగతి గదులు, ప్రయోగశాలలు, వ్యాయామశాల, లైబ్రరీలతో పాటు కళాశాల యందు గల రక్షిత త్రాగునీటి వసతి అనగా ఆర్ ఓ వాటర్ ప్లాంట్, విశ్రాంతి గదులు, ఆటస్థలం, టాయిలెట్ సౌకర్యాలు వంటి మౌలిక వసతులను కూడా పరిచయం చేయడం జరిగినది.

ప్రిన్సిపాల్ శశికళ మాట్లాడుతూ నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు ఈ సౌకర్యాలను సద్వినియోగపరుచుకుని మంచిగా విద్యను అభ్యసించి ప్రయోజకులుగా కాగలరని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శైలజ , ఐ. క్యు. ఏ.సి కోఆర్డినేటర్ చంద్రమోహన్ ఇతర అధ్యాపకులు విజయానంద్, శ్రీనివాసులు, చంద్ర రేఖ, వాసవి దేవి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Arattai