నంద్యాల RARS లో ప్రపంచ పత్తి దినోత్సవం
NANDYAL Oct07 :- నంద్యాల పట్టణంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం(RARS) నందు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ వి. జయలక్ష్మి గారు మాట్లాడుతూ మన రాష్ట్రంలో ప్రత్తి పంటను సాగుచేసే రైతులు ఎదుర్కొంటున్న టువంటి సమస్యలు,వాటిని
అధిగమించుటకు పాటించవలసినటువంటి విధానాలను తెలియపరిచారు. దరిక నిర్మూలనలో ప్రత్తి పంట సాగు విశిష్టమైనటువంటి పాత్ర పోషిస్తుందని తెలిపారు. దేశీయంగా స్థిరమైన ఆర్థిక అభివృద్ధికి తన వంతు తోడ్పాటున అందిస్తున్న ప్రత్తి పంట సాగు నేడు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న పరిస్థితులలో శాస్త్రవేత్తలు మరియు రైతులు కీలకపాత్ర పోషించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, నంద్యాల నుండి విడుదలై మన ప్రాంతానికి అనువైన రకాలను మరియు వాటి ప్రాధాన్యత గురించి వివరించారు. ప్రత్తి పంట లాభసాటిగా మారాలంటే తెగుళ్లు మరియు చీడపీడల నివారణకు నూతన విధానాలను పాటించాలని మరియు దేశీయంగా అధిక సాంద్రత విధానాలలో ప్రత్తి పంట సాగును ప్రోత్సహించడం మరియు యంత్రాల ద్వారా పత్తి తీయగలిగే వంగడాలను అందుబాటులోకి తీసుకురావడం ముఖ్యమని అన్నారు . ఈ కార్యక్రమములో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు మరియు పాలిటెక్నిక్ వ్యవసాయ విద్యార్థులు పాల్గొన్నారు.
Arattai