నoద్యాలలో ‘ప్రపంచ రేబీస్ దినోత్సవం’ పోస్టర్ ఆవిష్కరణ
NANDYAL Sep28 :- ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నoద్యాల జిల్లా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DM&HO) డాక్టర్ శారద బాయి గారు, జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ యస్. అశ్రుఫ్ ఆలీ గారు, జిల్లా “ప్రపంచ రేబీస్ దినోత్సవం – 2026” పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజషన్ అధికారి డాక్టర్ ప్రసన్న లక్ష్మీ గారు, డి పి యమ్ ఓ అధికారి డాక్టర్ శ్రీనివాసులు గారు మరియు డాక్టర్ శ్రీజ గారు ఇతర వైద్యులు మరియు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. “కలిసి ఉంటే మరింత బలం” (Stronger Together) అనే నినాదంతో రేబీస్ వ్యాధిపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా రేబీస్ వ్యాధి నివారణ, కుక్కలు మరియు తదితర జంతువుల కాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండటం, కుక్క కరిచిన వెంటనే గాయాన్ని సబ్బు మరియు నీటితో శుభ్రంగా కడిగి, ఆలస్యం చేయకుండా సమీపంలోని ప్రభుత్వ వైద్యసంస్థను సంప్రదించి అవసరమైన యాంటీ రేబీస్ వ్యాక్సిన్ మరియు వైద్య చికిత్స పొందాలని అధికారులు సూచించారు.“రేబీస్ను నివారించవచ్చు – అవగాహనతో ప్రాణాలను కాపాడవచ్చు” అనే సందేశంతో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులు పిలుపునిచ్చారు.
Arattai