నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ దినోత్సవం
NANDYAL Sep29 :- నంద్యాల: ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ నంద్యాల ఆధ్వర్యంలో శ్రీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్,విద్యార్థులకు గుండె ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
పంచాయతీరాజ్ ఇంజనీర్ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ ఇంజనీర్స్ దినోత్సవం

ఈ సందర్భంగా ఇండస్ హాస్పిటల్, నంద్యాల కార్డియాలజిస్ట్ లయన్ డాక్టర్ మురళి గారు, స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్, నంద్యాల పీడియాట్రీషియన్ లయన్ డాక్టర్ కార్తికేయ గారు విద్యార్థులను ఉద్దేశించి గుండె ఆరోగ్యం, ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు మరియు గుండె సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించారు.
విద్యార్థులు అడిగిన వివిధ ప్రశ్నలకు వైద్యులు సమాధానాలు ఇస్తూ, చిన్న వయస్సు నుంచే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. వైద్యుల విలువైన సూచనలు, అవగాహన కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచాయి అలాగే కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు మరియు సర్టిఫికెట్స్ అందచేశారు.

ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రాంగణాన్ని అందించి, కార్యక్రమ నిర్వహణకు సహకరించిన శ్రీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ పి. దస్తగిరి రెడ్డి గారు, డైరెక్టర్ పి. షావల్ రెడ్డి గారులకు లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లు అలవరచుకోవడం ద్వారా భవిష్యత్తులో గుండె సంబంధిత సమస్యలను నివారించవచ్చు అని కార్యక్రమంలో సందేశం ఇచ్చారు.ఈ కార్యక్రమం లో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్ కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి సురేష్, జోన్ చైర్మన్ నాగరాజు,సభ్యులు కిరణ్ లాల్ తదితరులు పాలుగోన్నారు.
Arattai