శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా NSS దినోత్సవ వేడుకలు
NANDYAL Sep24 :- శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో NSS దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ ఇంటర్నేషనల్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కందుకూరి శ్రీరామమూర్తి హాజరయ్యారు. కళాశాల చైర్మన్ డా. జి. రామకృష్ణారెడ్డి , ప్రిన్సిపాల్ శ్రీ కె.బి.వి. సుబ్బయ్య గారు, NSS ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఎం. శ్రావణి కుమారి,టి. మాధవరెడ్డి గారు, NSS వాలంటీర్లు పాల్గొన్నారు.

కార్యక్రమం ప్రారంభంలో విద్యార్థుల స్వాగత నృత్యం, ప్రార్థన నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథి, చైర్మన్, ప్రిన్సిపాల్ మరియు ఇతర అతిథుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా NSS కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలపై NSS PPT ప్రజెంటేషన్ నిర్వహించారు. అలాగే NSS ప్రత్యేక శిబిరంలో విద్యార్థులు నిర్వహించిన సేవా కార్యక్రమాలను ప్రతిబింబించే ప్రత్యేక క్యాంప్ వీడియోను ప్రదర్శించారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథి కందుకూరి శ్రీరామమూర్తి , చైర్మన్ డా. జి. రామకృష్ణారెడ్డి , ప్రిన్సిపాల్ కె.బి.వి. సుబ్బయ్య ప్రసంగిస్తూ, విద్యార్థులు చదువుతో పాటు సమాజ సేవలో కూడా చురుకుగా పాల్గొనాలని, NSS ద్వారా సేవాభావం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ మరియు సామాజిక బాధ్యత పెంపొందించుకోవాలని సూచించారు.

అనంతరం NSS ప్రత్యేక శిబిరంలో పాల్గొన్న వాలంటీర్లకు ప్రత్యేక శిబిర సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే వ్యాసరచన మరియు క్విజ్ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఉత్తమ సేవలు అందించిన NSS వాలంటీర్లను మరియు NSS ప్రోగ్రామ్ ఆఫీసర్లను ఘనంగా సన్మానించారు.

వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ మరియు కోలాటం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, NSS సేవా కార్యక్రమాల ప్రదర్శనకు కార్యక్రమానికి హాజరైన వారు అభినందనలు తెలిపారు.చివరగా జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ముగించారు. కళాశాల NSS విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సామాజిక సేవ పట్ల మరింత చైతన్యం కలిగించేలా విజయవంతంగా సాగింది.
Arattai