చండీదేవి అలంకారంలో నందలూరు శ్రీ కాళికాంబ అమ్మవారు
NANDALURU Oct14:- కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లిలోని శ్రీ కాళికాంబ దేవి, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం శ్రీ కాళికాంబ అమ్మవారు శ్రీ చండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేష అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు భక్తిప్రపత్తులతో మొక్కులు చెల్లించుకున్నారు.దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, అమ్మవారి దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.
Arattai