నంద్యాలలో శ్రీ అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు
NANDYAL Oct 12 :- నంద్యాల పట్టణం,శ్రీమతి కశెట్టి సుబ్బమ్మ మరియు బాలాజీ మర్చంట్స్ కమిటీ కళ్యాణ మండప దేవస్థానం నందు నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం రెండవ రోజు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.యెలుకూరు కుటుంబ సభ్యులు మహాలక్ష్మి రైస్ ఇండస్ట్రీస్ మరియు సురేష్ ఏజెన్సీ అలంకారానికి సహకరించినట్లు దేవస్థానం అధ్యక్షులు కశెట్టి కృష్ణమూర్తి తెలిపారు.బాలాజీ మర్చంట్స్ కమిటీ కల్యాణ మండప దేవస్థానం పాలకవర్గం మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు
Arattai