శ్రీఅరుణాచలేశ్వరస్వామి సన్నిధిలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.
ARUNACHALAM :- తమిళనాడు రాష్ట్రంలోని తిరుణామలై శ్రీఅరుణాచల క్షేత్రంలో సోమవారం నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి, ఆమె భర్త డాక్టర్ శివ చరణ్ రెడ్డి, తల్లీ బైరెడ్డి భారతమ్మ తదితర కుటుంబ సభ్యులు భక్తి శ్రద్దలతో శ్రీ అరుణాచల గిరి ప్రదక్షిణ చేసి, శ్రీ అరుణాచలేశ్వర శివయ్యను దర్శించుకుని, స్వామివారి దివ్య ఆశీస్సులు పొందారు.

అరుణాచల ఆలయం సందర్శించి, కాలినడకన సుమారు 16 కిలోమీటర్లు దూరం పాదయాత్రతో గిరి ప్రధక్షిణ ఎంతో ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నానని,ఆ అరుణాచలేశ్వరుని కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
Arattai