కౌశలం పోర్టల్ జాబ్ మేళాలో 147 మంది యువతకు ఉద్యోగాలు
NANDYAL Oct07 :- కౌశలం పోర్టల్లో నమోదు చేసుకున్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశాల మేరకు నంద్యాల కలెక్టరేట్లోని పి.జి.ఆర్.ఎస్. హాల్లో బుధవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో మొత్తం 578 మంది అభ్యర్థులు పాల్గొనగా, 147 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు అధికారులు ఈ సందర్భంగా ఆఫర్ లెటర్లను అందజేశారు.

ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా Apollo Tyres Ltd, Tata Electronics Ltd HR Services సంస్థలకు చెందిన హెచ్ఆర్ ప్రతినిధులు జాబ్ మేళాకు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేశారు.

జిల్లాలోని నిరుద్యోగ యువతకు పరిశ్రమలు, ప్రైవేట్ సంస్థల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను చేరువ చేయడంతో పాటు, వారి నైపుణ్యాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇటువంటి జాబ్ మేళాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు అధికారి లలిత బాయి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి, SGSW జిల్లా కోఆర్డినేటర్ ఖాదర్ బాషా, MSGO/USWOలు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Arattai