నంద్యాలలో రోటరీ పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
NANDYAL Oct28 :- నంద్యాల పట్టణం హనీఫ్ నగర్ రోటరీ పాఠశాలలో ఈరోజు ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్. అస్రార్ భాష గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు మరియు రహనీర్ పథకం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్. అస్రార్ భాష మాట్లాడుతూ, మైనర్ విద్యార్థులు బైకులు, స్కూటర్లు వంటి వాహనాలను నడపరాదని సూచించారు. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దయ్యే అవకాశం కూడా ఉంటుందని వివరించారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాతే అర్హతకు అనుగుణంగా వాహనాలు నడపాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ రహదారులపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.అలాగే, రోడ్డుపై ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే 108కు సమాచారం అందించాలని తెలిపారు. వీలైనంతవరకు ప్రమాద బాధితులకు సహాయం చేసి, వారిని ఆసుపత్రికి తరలించేందుకు తోడ్పడాలని చెప్పారు. ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందించే వ్యక్తులను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ బహుమతులు అందించే అవకాశం ఉందని వివరించారు. మానవత్వంతో స్పందించి బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ డి.వి. సుబ్బయ్య గారు పాల్గొని విద్యార్థులకు రహదారి భద్రత, క్రమశిక్షణ, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులకు విలువైన అవగాహన కల్పించిన ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్. అస్రార్ భాష గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ స్టేషన్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Arattai