ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం : మున్సిపల్ కమిషనర్
NANDYAL Oct27:- నవంబర్ ఒకటో తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు.

ఈనెల 28, 29 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు మున్సిపల్ కార్యాలయం నందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఎన్నికల విధుల్లో ఉన్న అర్హులైన ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు
Arattai