నంద్యాలలో ఘనంగా యోగాచార్యులు రాపర్తి రామారావు ఆరాధన ఉత్సవాలు
NANDYAL Oct25:- యోగా సాధనతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేసిన యోగాచార్యులు రాపర్తి రామారావు ఆరాధనోత్సవాలను నంద్యాల పట్టణంలోని యోగ చైతన్య కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు.యోగ గురువు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.

రాపర్తి రామారావు యోగ రంగానికి అందించిన అమూల్యమైన సేవలు,అనుష్ఠాన యోగ వేదాంత పద్ధతి ద్వారా సమాజంలో యోగ ప్రాధాన్యతను విస్తరించేందుకు చేసిన కృషిని శిష్యులు వివరించారు.అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Arattai