నందలూరులో వైభవంగా శ్రీ కాళికాంబ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
NANDALURU Oct16:- డప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లిలోని శ్రీ కాళికాంబ దేవి, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అమ్మవారి అలంకరణలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.

ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు శుక్రవారం శ్రీ కాళికాంబ అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విద్య, జ్ఞానం, వివేకానికి ప్రతీకగా కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, సకల శుభాలు కలగాలని ప్రార్థించారు
శరన్నవరాత్రి ఉత్సవాలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి దివ్య అలంకరణను దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. శ్రీ కాళికాంబ దేవి కటాక్షంతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని భక్తులు ఆకాంక్షించారు.
Arattai