రొమ్ము క్యాన్సర్ పై అవగాహనతోనే సంపూర్ణ ఆరోగ్యం: మంత్రి Nmd ఫరూక్
NANDYAL 02 :- మహిళలు తమ ఆరోగ్యం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రాథమిక దశలోనే రొమ్ము మార్పులను గుర్తించడం ద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ప్రాణాలు కాపాడుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తెలిపారు .

నంద్యాలలోని తన క్యాంప్ కార్యాలయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఉమెన్ డాక్టర్స్ వింగ్ మరియు నంద్యాల అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన “రొమ్ముల స్వీయ పరీక్ష” అవగాహన కరపత్రాన్ని డాక్టర్ల సమక్షంలో మంత్రి ఫరూక్ ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ “మీ ఆరోగ్యం… మీ చేతుల్లోనే” అనే నినాదంతో మహిళల్లో అవగాహన కల్పించేందుకు వైద్యులు చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో అభినందనీయమని అన్నారు . ప్రతి మహిళ నెలకు ఒకసారి క్రమం తప్పకుండా రొమ్ముల స్వీయ పరీక్ష చేసుకోవడం అలవాటు చేసుకోవాలని అన్నారు . శరీరంలో వచ్చే మార్పులను, గడ్డలను సకాలంలో గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదిస్తే ప్రాథమిక దశలోనే చికిత్స సులభమవుతుందని తెలిపారు . ప్రజారోగ్యం కోసం వైద్య సంఘాలు చేపడుతున్న ‘పింక్ వాకథాన్’ వంటి కార్యక్రమాలు సమాజంలో ఎంతో చైతన్యాన్ని తెస్తాయని అన్నారు .

డాక్టర్ల బృందం మాట్లాడుతూ అక్టోబర్ 3 ఉదయం 10 గంటలకు మున్సిపల్ టౌన్ హాల్ నుంచి టేక్కే మార్కెట్ యార్డ్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమంలో డాక్టర్లు మాధవి,లక్ష్మీ సౌజన్య.అనిల్ కుమార్, వి. హరిత, ఎస్. వసుధరణి , పి. సునీత పాల్గొన్నారు
Arattai