నంద్యాలలో ఘనంగా అశోక్ సింఘాల్ జయంతి వేడుకలు
NANDYAL Sep27 :- నంద్యాల పట్టణంలోని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయం నందు విశ్వహిందూ పరిషత్ (VHP)ప్రముఖ హిందూ ధార్మిక నాయకుడు అశోక్ సింఘాల్ జయంతిని ఘనంగా నిర్వహించారు.

VHP నాయకులు, కార్యకర్తలు అశోక్ సింఘాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంతో పాటు హిందూ ధార్మిక,సాంస్కృతిక అంశాలపై అశోక్ సింఘాల్ ఎంతో కృషి చేశారని VHP దక్షిణాంధ్ర అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో VHP పట్టణ అధ్యక్షురాలు సుహాసిని రెడ్డి, విశ్వహిందూ పరిషత్ నాయకులు, కార్యకర్తలు, హిందూ బంధువులు తదితరులు పాల్గొన్నారు.
Arattai