జిల్లాలో ఘనంగా ప్రారంభమైన ప్రపంచ పర్యాటక దినోత్సవ
NANDYAL Sep27:- పర్యాటకం అంటే కేవలం ఒక ప్రాంతాన్ని సందర్శించడం మాత్రమే కాదని, ఆయా పర్యాటక ప్రాంతాల చరిత్ర, విశిష్టత, ప్రాధాన్యత, మతపరమైన నేపథ్యాన్ని తెలుసుకోవడం కూడా పర్యాటకంలో భాగమని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్ లోని PGRS హాలు నందు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రారంభమైన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి సునీల్ కన్నా, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి శివారెడ్డి తో కలిసి వేడుకలు ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్.

జాయింట్ కలెక్టర్ ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు విద్యార్థులకు, పర్యాటకులకు శుభాకాంక్షలు తెలుపుతూ. జిల్లాలోని శ్రీశైలం, మహానంది, యాగంటి తదితర ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాల విశిష్టతను విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా, తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. మన ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాల గురించి మరింత మందికి తెలిసేలా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు.పర్యాటకుల సంఖ్య పెరగడం వల్ల జిల్లాలో ఆర్థిక అభివృద్ధి తో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు.పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్లాస్టిక్ రహిత వాతావరణాన్ని కల్పించడం, పరిశుభ్రతను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు మంచి ఆతిథ్యం అందిస్తూ, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్, లఘుచిత్రాల (Short Films) తదితర పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులను అభినందించి విజేతలకు జాయింట్ కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఇటువంటి పోటీల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులకు పర్యాటక ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, విశిష్టతపై కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం లభిస్తుందని పేర్కొంటూ వారిని అభినందించారు.

జిల్లా పర్యాటక శాఖ అధికారి.మాట్లాడుతూ కర్నూలు జిల్లా విభజన అనంతరం ఏర్పడిన నంద్యాల జిల్లా ఆధ్యాత్మిక, పర్యావరణ, చారిత్రకoగా పర్యాటకానికి అనుకూలమైన అనేక ప్రాంతాలను కలిగి ఉందని అధికారులు తెలిపారు. జిల్లాలో పర్యాటకాభివృద్ధికి సంబంధించి మొత్తం 28 ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. కొలిమిగుండ్ల మండలంలోని బెలుం గుహలు సుమారు 2.49 కిలోమీటర్ల మేర విస్తరించి, దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన సహజ గుహలుగా నిలిచాయన్నారు. జిల్లాకు ఇవి ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా ఉన్నాయని అన్నారు.

బేతంచెర్ల మండలంలో ఉన్న బిల్లసర్గం గుహలు చారిత్రక, సహజ ప్రాధాన్యత కలిగిన పర్యాటక ప్రాంతం, ప్యాపిలి మండల పరిధిలో ఉన్న ఈ సహజసిద్ధమైన గుహలు పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాల్లో ఒకటిగా ఉన్నాయని అధికారులు తెలిపారు.జిల్లాలోని శ్రీశైలం, యాగంటి, మహానంది, అహోబిలం వంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు రాష్ట్రంలోని పర్యాటక రంగంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. శ్రీశైలం ప్రముఖ శైవ క్షేత్రంగా, యాగంటి ఉమామహేశ్వర స్వామి వారి క్షేత్రంగా, మహానంది పంచనంది క్షేత్రాలలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా, అహోబిలం నవనరసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందాయన్నారు. అహోబిలం ప్రాంతం సాహస పర్యాటకానికి కూడా అనుకూలంగా ఉందని తెలిపారు. యాగంటి, అహోబిలంలో రోప్‌వే ప్రాజెక్టులకు ప్రతిపాదనలు శ్రీశైలంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న రోప్‌వే సౌకర్యంతో పాటు జిల్లాలోని ఇతర ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కూడా పర్యాటక మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.యాగంటి, అహోబిలం క్షేత్రాల్లో నూతన రోప్‌వే ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.

పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరంపర్యాటకం అంటే కేవలం ప్రదేశాలను సందర్శించడం మాత్రమే కాదని, ఆయా ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి విశిష్టతలను తెలుసుకోవడం ద్వారా కొత్త అనుభూతులను పొందడం కూడా పర్యాటకంలో భాగమని అన్నారు. నంద్యాల జిల్లాలోని విద్యార్థులు, యువత, ప్రజలు జిల్లాలోని కనీసం ఒక పర్యాటక ప్రాంతాన్ని సందర్శించి, వాటి విశిష్టతను ఇతరులకు తెలియజేస్తూ జిల్లా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. పర్యాటకుల రాక పెరగడం ద్వారా స్థానికంగా ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరగడంతో పాటు జిల్లా ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, పర్యాటక శాఖ అధికారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Arattai