అవగాహనతోనే హెచ్ఐవి రహిత సమాజం సాధ్యం: నంద్యాల జాయింట్ కలెక్టర్
NANDYAL Sep29 :- మంగళవారం నాడు ఎయిడ్స్ నివారణ ప్రచారం లో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ప్రభుత్వ సర్వజన అసువత్రి వరకు 5 K రెడ్ రన్ నిర్వహించిన రన్ లో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ జెండా ఊపిరి ప్రారంభజించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అవగాహనతోనే హెచ్ఐవి రహిత సమాజం సాధ్యం అని జాయింట్ కలెక్టర్ శ్రీ. సూరజ్ ధనంజయ్ పేర్కొన్నారు. హెచ్ఐవీ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించిందన్నారు.

హెచ్ఐవి నివారణే ధ్యేయంగా విసృత ప్రచారం నిర్వహణ లో భాగంగా 5 k రన్ ను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ అంశంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. చికిత్స తీసుకోవడం ద్వారా హెచ్ఐవీతో జీవిస్తున్న వారు సాధారణ జీవితం కొనసాగించవచ్చని, చికిత్స ద్వారా వైరల్ లోడ్‌ను నియంత్రించడం వల్ల ఇతరులకు, ముఖ్యంగా తల్లి నుంచి బిడ్డకు సంక్రమణను నివారించేందుకు అవకాశం ఉంటుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు.

హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవడంలో ఎలాంటి సిగ్గు లేదా భయం అవసరం లేదని, అవసరమైన యువత ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్. ఓ లలిత సూచించారు.

అనంతరం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో యువత మరియు కళాశాల విద్యార్థులలో HIV AIDS పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన “HIV AIDS Awareness Marathon 5 KM – Red Run” లో ప్రతిభ కనబరిచి పురుషుల విభాగంలో విజేతలుగా నిలిచిన వారికీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శారద బాయి ప్రశoశించారు. మొదటి బహుమతి సాధించిన ఆర్. బి. వినోద్ కుమార్,రెండవ బహుమతి సాధించిన ఏం. యోగ ఓబులేసు, అదే విధంగా మహిళల విభాగంలో మొదటి బహుమతి సాధించిన ఎమ్. సావిత్రి బాయి, రెండవ బహుమతి సాధించిన ప్రసన్న లను అభినందించి, రాష్ట్ర స్థాయిలో అక్టోబర్ 8 న జరిగే పోటీలలో పాల్గొంటారని డాక్టర్ శారదా బాయి తెలిపినారు.

కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డా. భరత్, డాక్టర్ కాంత రావు నాయక్, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ అలీ హైదర్, జిల్లా క్రీడా శాఖ అధికారులు శ్రీనివాసులు, ప్రసాద్, స్వచ్చంద సంస్థల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Arattai