రెడ్ క్రాస్ జన ఔషధీ ఆధ్వర్యంలో ఘనంగా సేవ సేతు అభియాన్ కార్యక్రమం.
NANDYAL :- నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మాత శిశు సంరక్షణ వార్డులోని కాన్ఫరెన్స్ హాల్ నందు గౌరవ ప్రధానమంత్రి జన్మదిన పురస్కరించుకొని చేస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు నంద్యాల రెడ్ క్రాస్ జన ఔషధీ ఆధ్వర్యంలో సేవా సేతు అభియాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ ఇన్చార్జి సూపరిండెంట్ డాక్టర్ చిట్టిబాబు ముఖ్య అతిథులుగా హాజరవ్వగా రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, జిల్లా కమిటీ సభ్యులు ఉస్మాన్ భాష ఫార్మసిస్టు ఇంద్రజ హాస్పిటల్స్ సిబ్బంది, పేషంట్ అటెండెన్స్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సూపర్డెంట్ మాట్లాడుతూ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద ప్రజలకు తక్కువ ధరలకు మందులు అందించాలని లక్ష్యంతో జన ఔషధీ మెడికల్ షాపులను ప్రారంభించారని దీని ద్వారా మార్కెట్ ధర కంటే దాదాపు 50 నుంచి 70% తక్కువకి మందులు అత్యంత క్వాలిటీతో లభించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా నిరుపేద రోగులకు దాదాపు 3 వేల రూపాయల విలువైన జన ఔషది మందులను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటుగా ప్రతి ఒక్కరికి పండ్లు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ డిఎఫ్ఓ అబ్దుల్లా, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Arattai